మొదలైన చార్ ధామ్ యాత్ర
అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12:35 గంటలకు గంగోత్రి, 12:41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు. మొదట గంగామాతకు ప్రత్యేక పూజాలు చేశారు. అనంతరం సీఎం పుష్కర్ ధామి గంగోత్రి ధామ్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత యమునోత్రి ధామ్ తలుపులు తెరిచారు. చార్ధమ్ యాత్ర సందర్భంగా భక్తులను సీఎం ధామి పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. యాత్ర సందర్భంగా గంగా డోలి ముఖ్బా గ్రామంలో ఆర్మీ బ్యాండ్ మేళాలతో గంగోత్రి ధామ్‌కు బయలుదేరింది.
ఈ సందర్భంగా గ్రామస్తులు భావోద్వేగానికి గురయ్యారు. డోలీపై పూలవాన కురిపిస్తూ గంగామాతకు వీడ్కోలు పలికారు. అనంతరం పల్లికీసేవతో ముఖ్బా నుంచి కాలినడకన గంగోత్రి హైవే చేరుకొని, అక్కడి నుంచి బైరో వ్యాలీకి చేరుకున్నారు. అక్కడ విశ్రాంతి తీసుకొని శనివారం ఉదయం 8 గంటలకు ధామ్‌కు బయలుదేరింది. అక్షత తృతీయ మధ్యాహ్నం 12:13 గంటలకు భక్తుల సందర్శనార్థం గంగోత్రి ధామ్ తలుపులు తెరిచారు.













