ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ
దుబాయ్ వెళ్లాల్సిన ఫెడెక్స్ విమానాన్ని పక్షి ఢీ కొట్టడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఎమర్జెన్సీ ప్రకటిచారు. దీంతో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ఎయిర్పోర్టు నుంచి ఫెడెక్స్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే దాదాపు 1000 అడుగుల ఎత్తులో దానిని పక్షి ఢీ కొట్టింది. అప్రమత్తమైన పైలట్లు విమానాశ్రయ అధికారులకు సమాచారం అందించారు. ల్యాండిరగ్కు అనుకూల పరిస్థితులు కల్పించాల్సిందిగా కోరారు. దీంతో ఆ సమయంలో ల్యాండ్ అవ్వాల్సిన విమానాలను అధికారులు దారి మళ్లించారు. టేకాప్కు సిద్ధంగా ఉన్న విమానాలను కూడా నిలిపి వేసి ఫెడెక్స్ విమానం ల్యాండింగ్ మార్గం సుగమం చేశారు. కొద్దిసేపటికి విమానం సేఫ్గా ల్యాండ్ అవ్వడంతో అధికారులంతా ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే సాంకేతిక సిబ్బంది విమానానికి మరమ్మతులు చేపట్టారు. అంతా బాగానే ఉందని నిర్ధారించుకున్న తర్వాత విమానం మళ్లీ టేకాప్ అయ్యేందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి పయనమైన విమానం అహ్మదాబాద్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ల్యాండ్ అయినట్లు పౌరవిమానయాన డైరెక్టర్ జనరల్ (డీజీసీఏ) వెల్లడిరచారు. విమానం ఢిల్లీ నుంచి పయనమైన తర్వాత ఎమర్జెన్సీని సడలించి రాకపోకలను పునరుద్ధరించారు.













