కేంద్రం ఓ శుభవార్త… డిసెంబర్ నాటికి అందరికీ

కేంద్ర పర్యావరణశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఓ శుభవార్త వినిపించారు. దేశ ప్రజలందరికీ డిసెంబర్ నాటికి కోవిడ్ టీకాలు ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటికే దానికి సంబంధించిన బ్లూప్రింట్‍ను కేంద్ర ఆరోగ్యశాఖ సిద్ధం చేసిందని చెప్పారు. దేశంలో కోవిడ్ వ్యాక్సినేషన్ పక్రియ ప్రారంభించి 130 రోజులైంది. అయితే ఇప్పటి వరకు ఇండియాలో 20 కోట్ల మంది టీకాలు తీసుకున్నారు. కోవిడ్ నియంత్రణలో టీకాలే కీలకమని అందరూ చెబుతున్న విషయం తెలిసిందే. అయితే వ్యాక్సినేషన్‍లో 20 కోట్ల మైలురాయిని అందుకున్న రెండవ దేశంగా ఇండియా నిలిచింది. వ్యాక్సినేషన్ పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ కౌంటర్ ఇచ్చారు. 2021 లోపే దేశంలో వ్యాక్సినేషన్ పక్రియ ముగుస్తుందన్నారు. వ్యాక్సిన్ల గురించి రాహుల్ ఆందోళన చెందితే, అప్పుడు ఆయన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల గురించి ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ పక్రియ గందరగోళంగా సాగుతోందని అన్నారు. 18-44 ఏళ్ల వారికి ఇచ్చిన కోటాను వాళ్లు తీసుకోవడం లేదని జవదేకర్ ఆరోపించారు.