ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు

చార్‌ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. దీంతో ట్రాఫిక్, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్దీ నివారణ చర్యలకు పూనుకుంది. యాత్రకు వచ్చేవారు ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. చార్ ధామ్ యాత్ర ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.