లాలూ ప్రసాద్ యాదవ్ కు సీబీఐ క్లీన్ చీట్!

ఆర్‍జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‍కు డీఎల్‍ఎఫ్ అవినీతి కేసులో సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. డీఎల్‍ఎఫ్ గ్రూప్‍కు చెందిన అవినీతి కేసును సీబీఐ 2018 నుంచి విచారించింది. ముంబైలోని బాంద్రాలో రైల్వే ప్రాజెక్టు, న్యూఢిల్లీలో రైల్వే స్టేషన్ ప్రాజెక్టు కోసం డీఎల్‍ఎఫ్ గ్రూప్ మాజీ రైల్వేశాఖ మంత్రి లాలూ యాదవ్‍కు ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఏజీ ఎక్స్పోర్టస్ ప్రైవేటు లిమిటెడ్ అనే ఓ బోగసు కంపెనీ అతి తక్కువ ధరకు ఢిల్లీలో ఓ ప్రాపర్టీని సొంతం చేసుకున్నదని, డీఎల్‍ఎఫ్ ఫండింగ్‍తో ఎక్కువ ధర పలికే భూమిని తక్కువ ధరకు అమ్మినట్లు ఆరోపణలు ఉన్నాయి. కాగా దాని వాస్తవ విలువ రూ.30 కోట్లు కాగా, 2011లో లాలూ కుటుంబ సభ్యులకు నామమాత్రపు ధరలకే రూ.5 కోట్లకు కట్టబెట్టారని సీబీఐ ఆరోపించింది.
తేజస్వియాదవ్ తో పాటు లాలూ కుటుంబ సభ్యులు ఆ ప్రాపర్టీని సొంతం చేసుకున్నారు. డీఎల్‍ఎఫ్, లాలూ మధ్య కుదిరిన లాలాదేవీలను కూడా సీబీఐ విచారించింది. అయితే రెండేళ్ల విచారణ తర్వాత ఆ ఒప్పందంలో ఎటువంటి అక్రమం జరగలేదని సీబీఐ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో లాలూకు సీబీఐ క్లీనిచిట్ ఇచ్చింది. దాణా కుంభకోణంలో దోషిగా తేలి గత మూడేళ్ల నుంచి జైలులో ఉన్న లాలూ ప్రసాద్ ఏప్రిల్‍లో బెయిల్‍పై విడుదలైన విషయం తెలిసిందే.