నకిలీ బెదిరింపు కాల్స్ చేస్తే… ఐదేండ్ల నిషేధం!

విమానాశ్రయాలకు, విమానాలకు నకిలీ బాంబు బెదిరింపులు చేసే దోషులపై ఐదేండ్ల పాటు విమానయాన నిషేధం విధించాలని పౌర విమానయాన భద్రత సంస్థ ప్రతిపాదన చేసింది. ఇలాంటివి ఇటీవల పెరగడంతో తాము ఈ ప్రతిపాదన చేయాల్సి వచ్చిందని బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ తెలిపారు. మంగళవారం 41 విమానాశ్రయాలకు వచ్చిన బాంబు బెదిరింపుల ఘటనలో ఆరుగురిని అరెస్టు చేశామని తెలిపారు.