బీజేపీ మరో కీలక నిర్ణయం
2024 లో దేశంలో రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఇప్పటి నుంచే ఎలక్షన్ ప్లాన్ షురూ చేసింది. దేశంలో బీజేపీ అధికారంలోలేని రాష్ట్రాలపై ప్రత్యేకంగా ఫోకస్ పెంచింది. మూడూ రాష్ట్రాల్లో కొత్తగా బీజేపీ అధ్యక్షులను నియమించింది. ఆయా రాష్ట్రాల్లో అధికారమే లక్ష్యంగా పనిచేసేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఢిల్లీ, బీహార్, రాజస్థాన్ రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను ప్రకటించారు. ఈ సందర్భంగా ఢిల్లీ బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్‌దేవా రాష్ట్ర శాఖ అద్యక్షుడిగా, లోక్‌సభ ఎంపీ సీపీ జోషి రాజస్థాన్ బీజేపీ చీఫ్‌గా నియమితులయ్యారు. బీహార్‌కు సంజయ్ జైస్వాల్ స్థానంలో బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడు సామ్రాట్ చౌదరిని రాష్ట్ర చీఫ్‌గా అధిష్థానం ఖరారు చేసింది.













