ఆంక్షలు ఎత్తేయండి.. రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో కొవిడ్ సందర్భంగా విధించిన ఆంక్షలన్నింటినీ ఓ క్రమ పద్ధతిలో ఎత్తేయాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ అన్ని రాష్ట్రాలకు లేఖలు రాశారు. ప్రస్తుత కొవిడ్ పరిస్థితులపై సమీక్షలు నిర్వహించాలని, ఒకవేళ కొవిడ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే ఆంక్షలను విధించాలని, లేని పక్షంలో ఆంక్షలను సడలించాలని లేఖలో సూచించారు. కరోనా కేసుల విషయంలో ప్రతి రోజూ రాష్ట్ర ప్రభుత్వాలు సమీక్షలు నిర్వహించాలని కూడా సూచించింది. టెస్టులు, వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలపై దృష్టి సారించాలని కేంద్రం పేర్కొంది.













