ఆ రోజు జరిగిన సంఘటన.. మన పోరాటాన్ని ఆపలేదు
వచ్చే ఏడాది ఆరు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీపడనున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి 9 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. జవనరి 26వ తేదీన ఢిల్లీలో హింసకు పాల్పడిన రైతులను అరెస్టు చేయాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. 26న జరిగిన ఘటన క్షమించరానిదని, పార్టీ ఎవరైనా, నేత ఎవరైనా, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. రిపబ్లిక్ డే నాడు జరిగిన రైతుల ట్రాక్టర్ల ఆందోళనలతో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం ఆగలేదని క్రేజీ అన్నారు. రైతులకు అందరం కలిసి మద్దతు ఇవ్వాలని, ఆ రోజు జరిగిన సంఘటన మన పోరాటాన్ని ఆపలేదన్నారు.













