హెచ్‌పీసీఎల్ కు అరుదైన గౌరవం
హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)కు అరుదైన గౌరవ దక్కింది. స్వచ్ఛ పక్వాడా కార్యక్రమంలో భాగంగా 3,00,000 విత్తన బంతులు (సీడ్ బాల్స్) తయారు చేయటంతో సామూహిక ప్రతిజ్ఞ చేసినందుకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో హెచ్‌పీసీఎల్ చోటు దక్కించుకుంది. ఈ మేరకు సిరిపురంలో హెచ్‌సీపీఎల్ ప్రతినిధులకు రికార్డ్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఈడీ వి.రతన్ రాజ్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ స్ఫూర్తితో 15 రోజుల పాటు విభిన్న కార్యక్రమాలను నిర్వహించామన్నారు. వాటిని గుర్తించి హెచ్‌పీసీఎల్‌కు ఈ గౌరవం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్‌పీసీఎల్ సీజీఎం కె.నగేష్, బీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు.













