రష్యన్ బలగాలకు ఏ భూభాగాన్ని విడిచిపెట్టం : జెలెన్స్కీ
దేశంలోని ఏ భూభాగాన్ని రష్యన్ బలగాలకు విడిచిపెట్టబోమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొత్తం మీద మనదేశంలోని ఏ ప్రాంతాన్ని వదులుకునేది లేదు. ఇప్పటికే మనం చాలా ప్రాణాలు కోల్పోయాము. కాబట్టి వీలైనంత కాలం స్థిరంగా ఉండాలి. కానీ ఇది జీవితం భిన్నమైన విషయాలు జరుగుతుంటాయి. అని వేదాంత ధోరణిలో తెలిపారు. శాంతి విషయానికొస్తే భూభాగాలను వదులుకునే అంశం చర్చకొస్తే తప్పకుండా దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తామని అన్నారు. మేం రష్యా పక్షాన్ని అర్థం చేసుకున్నాము. క్రిమియాను రష్యన్ భూభాగంగా గుర్తించడం రష్యా దీర్ఘకాలిక డిమాండ్లలో ఒకటి. కానీ దీనిని నేను ఒప్పుకునే ప్రసక్తే లేదు. వారు మన దేశంలోని దక్షిణ భాగాలను ఆక్రమించుకోవాలని చూస్తున్నారు అని అన్నారు. మేము మొదటి నుంచి మా భూభాగాన్ని వదులుకోవడానికి సిద్ధం లేమని చెబుతున్నాం. లేదంటే ఇప్పుడు ఈ యుద్ధమే ఉండేది కాదు అని తెలిపారు.













