రష్యా అనుకూల అధికారులకు ఉద్వాసన : జెలెన్స్కీ
దేశ పాలనా యంత్రాంగంలో కీలకమైన మార్పు చేర్పులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ శ్రీకారం చుట్టారు. ఉక్రెయిన్ భద్రతా సంస్థ ఎస్బీయూ అధిపతి ఇవాన్ బాకనోవ్, ప్రాసిక్యూటర్ జనరల్ ఐరినా వెనెడిక్టోవాలను పదవుల నుంచి తొలగించారు. వారిద్దరి పనితీరు నాసిగా ఉండటమే కాదు, వారి సంస్థల్లోని ద్రోహులను కనిపెట్టడంలో విఫలమయ్యారంటూ వారికి ఉద్వాసన పలికారు. వారి స్థానంలో తాత్కాలికంగా వేరే అధికారులను నియమించారు. తాజా నిర్ణయాతో జెలెన్స్కీ ఉక్రెయిన్ సైన్యం పైన, భద్రతా సంస్థలపైన పట్టు పెంచుకున్నారు. ప్రస్తుత యుద్ధ కాంలో ఉక్రెయిన్ అధికార యంత్రాంగంలోని రష్యన్ అనుకూలురను ఏరివేసి అన్ని విధాల సమర్థులైన అధికారులను నియమించడంపై జెలెన్స్కీ లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సమాచారం.













