శత్రువు నిర్ణయాలతో కాదు.. పోరాటం ద్వారానే
మాస్కోలో కూర్చొని శత్రువు తీసుకునే నిర్ణయంతో ఉక్రెయిన్లో శాంతి రాదని అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. తమ భూభాగాన్ని పుతిన్ సేనలు ఖాళీ చేసి వెళ్తాయనే శుష్క వాగ్దానాలను నమ్మాల్సిన అవసరం లేదన్నారు. పోరాటం ద్వారానే శాంతి సాధ్యమని తెలిపారు. ప్రత్యర్థిని బలహీనపరచడానికి, వారి వ్యూహాలు వమ్ము చేయడానికి ప్రతి ఒక్కరూ ఎంత వీలైతే అంత చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బుచాలో జరిగింది కచ్చితంగా సామూహిక హత్యాకాండ అని నిప్పులు చెరిగారు. తమపైకి పంపిస్తున్న ప్రతి క్షిపణి, ప్రతి బాంబు రష్యా చరిత్రను నల్లగా మార్చేస్తాయని తెలిపారు.













