జెలెన్ స్కీ ఎక్కడ ఉన్నాడో తెలుసా?
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ దేశం విడిచి వెళ్లినట్లు రష్యా మీడియా ప్రసారం చేసింది. ఉక్రెయిన్ వీడి ప్రస్తుతం పోలాండ్‌లో జెలెన్ స్కీ తలదాచుకున్నట్లు తెలిపింది. ఇంతకు ముందు కూడా జెలెన్ స్కీ దేశం విడిచిపెట్టినట్టు వార్తలు వెలువడ్డాయి. కానీ ఆ వార్తలను ఉక్రెయిన్ అధ్యక్షుడు కొట్టిపారేశాడు. తాను రాజధాని కీవ్‌లో ఉన్నట్లు వీడియా ద్వారా స్పష్టం చేశారు. రష్యా మీడియా లో వస్తున్న కథనాలన్నీ కట్టుకథలే అని విమర్శించాడు. కీవ్‌లో జెలెన్ స్కీ ఉన్నట్టు స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య కొనసాగుతున్న ప్రస్తుత తరుణంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ అంతం చేసేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తున్నట్టు వార్తలు వెలువడ్డాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి జెలెన్ స్కీను హత్య చేసేందుకు మూడు సార్లు ప్రయత్నించినట్టు సమాచారం. దేశం విడిచి వచ్చేయాలని రక్షణ కల్పిస్తామని అగ్ర రాజ్యాలు ఆహ్వానం పలికినా జెలెన్ స్కీ సున్నితంగా తిరస్కరించారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా చేసిన విన్నపానికి నో చెప్పారు. యుద్ధ భూమిలో ఉంటూ సైనికుడిగా మారిపోయారు.













