తమను ఓడించే సత్తా.. వారి దగ్గర లేదు
రష్యా భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. యుద్దాన్ని ముగించేందుకు రష్యా చర్చల బాట పట్టినట్టు తెలిపారు. రష్యా లోగడ అల్టిమేటమ్లను జారీ చేసేదంటూ ఇప్పుడు చర్చల సంకేతం పంపించడం సంతోషకరమన్నారు. ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైన నాటి నుంచి ఉక్రెయిన్, రష్యా మధ్య పలు విడతలు చర్చలు జరిగినా ఎటువంటి ఫలితం రాకపోవడం గమనార్హం. మరోవైపు రష్యా వద్ద ఆయుధ బలమే కానీ, తమను ఓడించే సత్తా లేదంటూ జెలెన్స్కీ మరో ప్రకటన విడుదల చేశారు. రష్యా చొరబాటుదారులు మమ్మల్ని ఓడించలేరు. అంతటి బలం వారి దగ్గర లేదు. వారు కేవలం హింసను నమ్ముకున్నారు. యుద్ధాన్ని ఆపే దిశగా కృషి చేస్తున్నట్టు కనిపించడం లేదని విశేష్లకుల అభిప్రాయం.













