పునర్నిర్మాణం ప్రపంచ బాధ్యత : జెలెన్స్కీ
లుహాన్స్క్ నుంచి తమ దళాలు వెనుదిరగడం నిజమేనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. స్విజ్జర్లాండ్లో ఉక్రెయిన్ రికవరీ కాన్ఫరెన్స్ లో ఆన్లైన్ ద్వారా ప్రసంగించారు. ఆయుధాలు సమకూర్చుకొని బలం పుంజుకుని పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉక్రెయిన్ పునర్నిర్మాణం ప్రజాస్వామ్య ప్రపంచ ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్నారు. రష్యా దాడుల్లో దెబ్బతిన్న తమ దేశ పునర్నిర్మాణం అనేది స్థానిక ప్రాజక్టు లేదా ఒక దేశ ప్రాజెక్టు కాదని అన్నారు. ప్రజాస్వామ్య ప్రపంచంలో నాగరిక దేశాలు ఉమ్మడి కార్యాచరణ అని వెల్లడిరచారు. రష్యాతో యుద్ధం ముగిసిన తర్వాత తమ దేశ పునర్నిర్మాణానికి 750 బిలియన్ డాలర్లు అవసరమని ఉక్రెయిన్ ప్రధాని అంచనా వేశారు. ఈ మేరకు రికవరీ ప్లాన్ రూపొందించారు.













