రష్యాపై ఉక్రెయిన్ అధ్యక్షుడు సంచలన ఆరోపణలు
ఉక్రెయిన్ పై భీకర దాడులు చేస్తున్న రష్యా అనేక అఘయిత్యాలకు పాల్పడుతున్నట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా సంచలన విషయాలు తెరపైకి తెచ్చారు. రష్యా ఐదు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను ఎత్తుకెళ్లిందని ఆరోపించారు. వారిని బలవంతంగా రష్యాలోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తమ దేశ పౌరుల కీలక పత్రాలను వ్యక్తిగత వస్తువులను స్వాధీనం చేసుకుంనేందుకు కూడా రష్యా ప్రయత్నిస్తోందన్నారు. అంతేకాదు రష్యన్లు ఉక్రెయిన్ చిన్నారులను దత్తత చట్టవ్యతిరేక రీతిలో దత్తత తీసుకునే ప్రయత్నాలు కూడా చేశారని వెల్లడించారు.













