తాము చర్చలకు సిద్ధమే అయితే.. మరో అధ్యక్షుడితో మాత్రమే
జపోరిజియాలో తమ నియంత్రణ పరిధిలోని ప్రాంతాలపై రష్యా చేపట్టిన భారీ దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఖండించారు. యుద్ద క్షేత్రంలో ఎదురవుతున్న పరాభావాన్ని, మా సేనలు కనబరుస్తున్న సమర్థతను చూసి శత్రువు తట్టుకోలేకపోతున్నాడు. అందుకే కోపంతో ఈరోజు విరుచుకుపడి, అమాయకుల ప్రాణాలు బలితీసుకున్నాడు. మేము కోల్పోయిన ప్రతి ప్రాణం విషయంలోనూ శత్రు దేశం సమాధానం చెప్పక తప్పదు. ఆ సమయం తప్పకుండా వస్తుంది. తాము రష్యాతో చర్చలకు సిద్దమేనని, అయితే మరో అధ్యక్షుడితో మాత్రమే చర్చలు జరుపుతామని అన్నారు. ఉక్రెయిన్ నాటో కూటమిలో చేరే విషయమై దరఖాస్తు ప్రక్రియను వేగవంతం చేస్తాం ఇందుకు నిర్ణయాత్మకంగా ముందడుగు వేసి యాక్సెలెరేటెడ్ అప్లికేషన్ను సమర్పిస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. యుద్దారంభంలో తమపై ఆంక్షలకు దిగిన పశ్చిమ దేశాలు ఇప్పుడు ఏకంగా ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు.













