డోన్బాస్ చిక్కితే ముందుగానే.. ముగిసే చాన్స్
రష్యా యుద్దానికి ముగింపు కనుచూపు మేరలో కన్పించడం లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. తమ దేశంలో జరిపిన ప్రతీ హత్యాకాండకూ, దాడికీ పుతిన్ పశ్చాత్తాపడేలా చేసి తీరతామన్నారు. డోన్బాస్లో రోజుల వ్యవధిలో చేజిక్కించుకుంటానని ఫిబ్రవరిలో యుద్ధం ప్రారంభంలో రస్యా ఆశ పడింది. నాలుగు నెలలవుతున్నా అక్కడ పోరాటం సాగుతూనే ఉంది. అక్కడ రష్యా బలగాలను సమర్థంగా అడ్డుకుంటున్న మా సేనలను చూస్తే ఎంతో గర్వంగా ఉంది అన్నారు. యుద్ధం తొలినాళ్లలో ఆక్రమించుకున్న దక్షిణ ఖెర్సన్ నుంచి కూడా రష్యా బలగాను తాజాగా వెనక్కు తరిమినట్టు ఆయన తెలిపారు. యుద్ధ లక్ష్యాలను త్వరగా సాధిచంచలేమన్న వాస్తవాన్ని రష్యా అర్థం చేసుకుందని, అందుకే అక్టోబర్ దాకా పోరు కొనసాగించాలని నిర్ణయించుకుందని ఉక్రెయిన్ సైన్యం అంచనా వేస్తోంది. డోన్సాస్ చిక్కితే ముందుగానే ముగించొచ్చని భావిస్తోంది.













