ఉక్రెయిన్ అధ్యక్షుడిపై ప్రశంసలు
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేపట్టిన అమెరికా పర్యటనపై స్వదేశంలో ప్రశంసల వర్షం కురుస్తుండగా శ్రతుదేశం రష్యాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. జెలెన్స్కీ పర్యటన పూర్తి స్థాయిలో విజయవంతమైందని, అమెరికా నుంచి సాయం రాబట్టడంలో ఆయన ప్రతిభ చాటుకున్నారని ఉక్రెయిన్ పౌరులు చెబుతున్నారు. కానీ, ఘర్షణను మరింత రాజేయడానికే జెలెన్స్కీ అమెరికా వెళ్లారని రష్యా అధికారులు మండిపడుతున్నారు. చక్కటి ఫలితాలతో తాను అమెరికా నుంచి తిరిగి వెళ్తున్నానని సంతోషం వ్యక్తం చేస్తూ జెలెన్స్కీ ఒక వీడియా సందేశం విడుదల చేశారు. అమెరికా సాయం తమకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. రష్యాపై పోరాటం సాగిస్తున్న తమకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా అధ్యక్షుడు జో బైడైన్‌కు అమెరికా పార్లమెంట్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.













