ఉక్రెయిన్ అధ్యక్షుడు కొత్త డిమాండ్…
రష్యాతో యుద్ధం, ఆ దేశంలో యుద్ధాన్ని ఆపే దిశగా ఓ వైపు బెలారస్లో చర్చలు జరుగుతున్న సమయంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ కొత్త డిమాండ్‌ను తెర మీదకు తెచ్చారు. తమకు యూరోపియన్ యూనియన్‌ల్లో సభ్యత్వం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు వీడియో సందేశంలో వినిపించారు. ఉక్రెయిన్ను వెంటనే యూరోపియణ్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలి. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది మా లక్ష్యం. ఇది మా న్యాయమైన హక్కు. ఇది సాధ్యమవుతుందని భావిస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఉక్రెయిన్‌కు యుద్ధ విమానాలను పంపాలని యూరోపియన్ యూనియన్ దేశాలు నిర్ణయించిన సంగతి తెలిసిందే.













