మా బలమేంటో చూపిస్తాం.. రష్యాకు ఉక్రెయిన్ వార్నింగ్
రష్యా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటామని వారి దురాక్రమణకు బయపడేది లేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హెచ్చరించారు. తమ సత్తా ఏంటో రూపించుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఆస్పత్రులు, నివాస ప్రాంతాలపై దాడులకు దిగుతూ రష్యా ఉగ్రచర్యలను పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మస్కో దురాక్రమణలను ప్రతిఘిస్తాం, అందులో తగ్గేది లేదని స్పష్టం చేశారు. తమ చివరి శ్వాస వరకు పోరాడతామని తెలిపారు. ఉక్రెయిన్ వాసుల గురించి రష్యన్లకు ఏమీ తెలీయదు, వారు ఇక్కడ ఏం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా బలగాలు చంపడానికి, చావడానికే ఇక్కడకు వచ్చారంటూ ఫైర్ అయ్యారు. ఇది మా జన్మభూమి, మా పిల్లల బంగారు భవిష్యత్తు కోసం మా నేలను కాపాడుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. మా జన్మభూమిలో మేము బలంగానే ఉన్నాం, ఎవరికీ తగ్గేదిలేదని రష్యాకు వార్నింగ్ ఇచ్చారు.













