వారు ఉక్రెయిన్ ను ఓడించలేరు .. అందుకే మా ప్రజలను
రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లోని పవర్ గ్రిడ్‌కు అంతరాయం కలిగి విద్యుత్ సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. దీంతో సుమారు 45 లక్షల మంది అంధకారంలో చిక్కుకున్నారు. రష్యా ఇంధన ఉగ్రవాదాన్ని ఆశ్రయించడం దాని బలహీనతకు నిదర్శనం. వారు యుద్ధభూమిలో ఉక్రెయిన్ను ఓడించలేరు. అందుకే మా ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు అని దేశాధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. విద్యుత్‌ను పొదుపుగా వాడాలని ప్రజలను కోరారు. ఐరోపాలోనే అత్యంత పెద్దదైన అణు విద్యుత్ కేంద్రం ఉక్రెయిన్‌లోని జపోరిజియాలో ఉంది. ఈ విద్యుత్ కర్మాగారం పవర్ లైన్లను లక్ష్యంగా చేసుకుని రష్యా దాడులు చేస్తోంది.













