చైనా అధ్యక్షుడు రెండేళ్ల తర్వాత.. దేశం నుంచి
చైనా అధినేత షీ జిన్పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్జెకిస్తాన్ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఉజ్జెకిస్తాన్లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సుల్లో జిన్పింగ్ పాల్గొనున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. జిన్ పింగ్ 2020 జనవరిలో మయన్నార్ పర్యటన తర్వాత విదేశాలకు వెళ్లడం మానుకున్నారు. ఎస్పీఓలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిజిస్తాన్, తజకిస్తాన్, ఉజ్జెకిస్తాన్, భారత్, పాకిస్తాన్, సభ్యదేశాలు. ఇరాన్ను సైతం చేరుకొనేందుకు రంగం సిద్ధమయ్యింది.













