ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేము : అమెరికా
ఢిల్లీ, ముంబై నగర్లాలోని బీబీసీ కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగాయి. బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. ఈ విషయం వాషింగ్టన్ డీసీకి తెలిసిందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ప్రైస్ తెలిపారు. అయితే ఈ విషయంలో తాము ఎలాంటి నిర్ణయం తీసుకునే స్థితిలో లేమని వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛ, మానవ హక్కుల వల్లే అమెరికా, భారత్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం బలోపేతమైందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.













