జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు… పుతిన్ ని ఆయన సన్నిహితులే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగి ఏడాది పూర్తయిన సందర్భంగా డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఈ సందర్భంగా జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్ పాలన ఎప్పుడో ఒకప్పుడు అంతం కాక తప్పదు. అతని నాయకత్వం బలహీనపడే సమయం ఆసన్నమైంది. పుతిన్‌ను ఆయన సన్నిహితులే వ్యతిరేకిస్తారు. వారు ఏదో ఒక కారణం చూపించి పుతిన్‌ను హతమారుస్తారు. ఆ రోజు నేను చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటారు. ఇది కచ్చితంగా జరుగుతుందా అని నన్ను అడిగితే అవును అనే సమాధానమిస్తా. కానీ ఎప్పుడు? అంటే మాత్రం నేను చెప్పలేను అని అన్నారు.













