పుతిన్ రాజీనామా వార్త నిజమేనా?
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పదవికి త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు వార్త. ఆయన పార్కిన్సన్స్ వ్యాధితో బాధపడుతున్నారు.. దీంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయనున్నట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్ పోస్ట్‌లో ఒక కథనం ప్రచురితమైంది.. జీవితకాల రష్యా అధ్యక్షుడైన పుతిన్ తీవ్ర అనారోగ్యం పాలుకావడంతో ఆయనకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.. దీంతో ఆయన కుటుంబ సభ్యులు అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.. వచ్చే ఏడాది జనవరిలో ఆయన రాజీనామా చేసే అవకాశాలున్నట్లు పేర్కొంటున్నారు. అధికారికంగా దీనిపై సమాచారం లేదని అంటున్నారు.













