భారత్ కు..అమెరికా సంస్థ భారీ విరాళం

కరోనా సెకండ్ వేవ్ భారత్‍ను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, అమెరికాకు చెందిన ఐటీ సర్వ్ అలయెన్స్ అనే స్వచ్చంద సంస్థ అండగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. ఐటీ సర్వ్ ఆలయన్స్ సంస్థ రెండు లక్షల డాలర్లు వారి సభ్యుల నుంచి సేకరించి తద్వారా 200 ఆక్సిజన్ కాన్‍సంట్రేటర్స్ పరికరాలు, 20 వెంటిలేటర్స్ కొనుగోలు చేసి సేవ ఇంటర్నేషనల్, అమెరికా ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అనే సంస్థల ద్వారా భారత్‍కు పంపారు.
గతంలో కూడా అమెరికాలో కొవిడ్ 19 వచ్చినపుడు ఈ ఐటీ అలయన్స్ 16 విభాగాల ద్వారా 2 లక్షల 50 వేల డాలర్లు సేకరించి సహాయ నిధిగా అందించారు. ఈ ఐటీ సర్వ్ అలయన్స్ సంస్థలో సుమారు 1200 మంది వ్యాపార యజమానులు సభ్యులు ఉంటూ ఆ దేశ నలుమూలలకు వారి సేవలు అందిస్తున్నారు. ఐటీ సర్వ్ అలయెన్స్ నేషనల్ ప్రెసిడెంట్ రఘుచిట్టిమళ్ళ, గవర్నింగ్ బోర్డు చైర్మన్ శశి దేవిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు, టీమ్ డల్లాస్ సభ్యులు ఈ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.