మయన్నార్ పోరాటానికి మా మద్దతు
మయన్నార్లో సైనిక పాలనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారడంపై అగ్రరాజ్యం స్పందించింది. ఆ దేశంలో శాంతియుత, ప్రజాస్వామ్య పాలన కోసం పోరెత్తిన ప్రజలకు అండగా ఉంటామని అమెరికా ప్రకటించింది. అంతేకాకుండా మయన్మార్లో సైనిక పాలకులు కొనసాగిస్తున్న హింసాకాండను ఆపాలని విజ్ఞప్తి చేసిది. ఈ మేరకు అమెరికా విదేశాంగ ప్రతినిధి నెడ్ ఫ్రైజ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. శాంతియుత, ప్రజాస్వామిక పరిపాలన కోసం మయన్మార్ దేశీయులు చేస్తున్న పోరాటానికి మా మద్దతును కొనసాగిస్తున్నాం. తమ దేశంలో హింసా కాండను ఆపాలని మిలటరీ పాలకులకు విజ్ఞప్తి చేస్తున్నాం. దాంతో పాటు అక్రమంగా కేసులు వేసి నిర్బందించిన జర్నలిస్టులను, కార్యకర్తలను విడుదల చేసి, ప్రజల మనోభావాలను గౌరవించాలి అని ప్రైజ్ పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ పోరులో మయన్మార్ ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని చెప్పారు.













