భారత్ పర్యటనకు అమెరికా రక్షణ కార్యదర్శి
అమెరికా రక్షణ కార్యదర్శి లాయిడ్ ఆస్టిన్ నేడు న్యూఢిల్లీకి రానున్నారు. మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశం కానున్నారు. చైనా, ఆప్ఘనిస్తాన్ సహా ముఖ్యమైన ప్రాంతీయ భద్రతా సమస్యలపై భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్దోవల్తో ఆస్టిన్ చర్చించనున్నారు. అమెరికన్ రక్షణ కార్యదర్శి, ఎన్ఎస్ఎల మధ్య జరగనున్న చర్చలు ఇరు దేశాల మధ్య జరిగే మొదటి ముఖాముఖి చర్చలు కానున్నాయి. ప్రధాని మోదీతో పాటు విదేశాంగ మంత్రితో కూడా సమావేశం కావాలని ఆస్టిన్ భావిస్తున్నారు. కాగా, ఆస్టిన్ మార్చి 19 నుండి 21 వరకు భారత్లో సందర్శించడంతో పాటు దేశంలోని అత్యున్నత రాజకీయ, సైనిక నేతలతో సమావేశం కానున్నారు.













