అమెరికాలో అన్ని విమాన సర్వీసులకు బ్రేక్
అమెరికా విమాన సర్వీస్ లను క్రమబద్ధం చేసే కంప్యూటర్ వ్యవస్థలో సాంకేతిక లోపం తలెత్తడంతో బుధవారం 4 గంటల నుంచి అమెరికా మొత్తం విమాన సర్వీస్లు నిలిచిపోయాయి. అలాగే ఇప్పటికే ప్రయాణిస్తున్న విమానాలను సమీపంలోని విమానాశ్రయంలో దించివేశారు. సాంకేతిక లోపం గురించి అమెరికా పెడరల్ సర్వీస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ, లోపాన్ని సవరించే ప్రక్రియ కొనసాగుతున్నదని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా అమెరికా పౌర విమాన యాన సర్వీస్లను పూర్తిగా నిలిపివేసినట్లు పేర్కొంది. ఇతర దేశాల నుంచి వస్తున్న విమానాలను క్రమబద్దీకరిస్తున్నమని పేర్కొంది. కంప్యూటర్ వ్యవస్థ కారణంగా విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో వేలాది మంది ప్రయాణికులు విమానాశ్రయంలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.













