ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ విజ్ఞప్తి… కనీసం ఐరాస చార్టర్ కైనా
తమ దేశంపై రష్యాపై దాడి చేసి ఏడాది అవుతున్న వేళ మాస్కోకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో తాము పెడుతున్న తీర్మానానికి మద్దతు ఇవ్వాలని ప్రపంచ దేశాలకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రి కులేబా విజ్ఞప్తి చేశారు. ఐరాస జనరల అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని దేశాలు మాతోపాటు రష్యాతోనూ స్నేహంగా ఉండాలని భావిస్తున్నాయి. వారికి మేం చెప్పేదొకటే. ఈ యుద్ధంలో రెండు పక్షాలు లేవు. దురాక్రమణదారుడు, బాధితుడు మాత్రమే ఉన్నారు. మేం బతకాలనుకుంటున్నాం. వారు చంపాలనుకుంటున్నారు. మా దేశాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఉక్రెయిన్‌కు అండగా నిలవడం ఇష్టం లేకపోతే కనీసం ఐరాస చార్టర్కైనా మద్దతివ్వండి అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ భూభాగం నుంచి భేషరతుగా రష్యా వైదొలగాలని ఈ ముసాయిదా తీర్మానం ప్రతిపాదిస్తోంది.













