దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది సభ్యదేశాలే తప్ప .. తాను కాదు
భారత్ అత్యంత ప్రధానమైన దేశమనీ, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) వంటి బహుళపాక్షిక ఆర్థిక సంస్థల్లో ముఖ్యమైన భాగస్వామి అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఉద్ఘాటించారు. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం పొందాలన్న భారత్ ఆకాంక్షలను తాను అర్థం చేసుకోగలనని, అయితే దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది సభ్య దేశాలే తప్ప తాను కాదని వివరించారు. నేటి ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఐరాస వ్యవస్థలను పునర్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. జీ20 సదస్సులో పాల్గొనడానికి గుటెరస్ ఇక్కడికి వచ్చిరు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహోపనిషత్ స్ఫూర్తితో జీ20 ప్రకటిస్తున్న ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిత నినాదాన్ని ఆయన బలపరిచారు. మన ప్రపంచం ఒకే కుటుంబమే అయినా అది కలహాల కొలిమిలా మారిందన్నారు.













