వారు పారిపోవడానికి ఇదే మంచి అవకాశం
ఖర్కీవ్లోని రెండు ప్రాంతాల నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటున్నట్లు రష్యా రక్షణశాఖ ప్రకటించిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఘాటుగా స్పందించారు. ఉక్రెయిన్ సైన్యం ఇజియం పట్టణాన్ని తిరిగి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నప్పటి నుంచి రష్యన్ సైనికులు భయంతో పరుగులు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. రష్యన్ సైన్యం వెన్ను చూపడంలో ఉత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. వారు పారిపోవడానికి ఇదే మంచి అవకాశం. ఉక్రెయిన్లో అక్రమణదారులకు చోటులేదు. ఈ నెలలో ఇప్పటి వరకు రెండువేల చ.కి.మీ కంటే ఎక్కువ ప్రాంతాన్ని మా సేనలు విముక్తి చేశాయి. ఆయా ప్రాంతాల్లో కీవ్ సైనికులు ముందంజలో దూసుకెళ్తున్నారు. ఈ వీరోచిత పోరాటంలో భాగమైన మా బలగాలకు కృతజ్ఞతలు. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనా ఆర్మీగా పేరు తెచ్చుకునేందుకు రష్యా దళాలు పరుగులు పెడుతున్నాయి అంటూ జెలెన్స్కీ ఎద్దేవా చేశారు.













