క్యూల్లో నిలబడి రోజుకు … 16 వేలు సంపాదన
బ్రిటన్కు చెందిన ఫ్రెడ్డీ బెకిట్(31) క్యూల్లో నిల్చొని రోజుకు 16 వేలు సంపాదిస్తున్నాడు. గంటలకు 20 యూరోలు (దాదాపు రూ.2 వేలు) ఛార్జ్ చేసే ఫ్రెడ్డీ రోజూ తన క్లయింట్స్ కోసం 8 గంటలు క్యూలో నిల్చుంటాడు. బ్రిటన్లో తరచూ ఈవెంట్లు జరుగతాయి. వీటి టికెట్లు కావాలంటే కనీసం గంటైనా క్యూలో నిల్చోవాలి. శీతాకాలంలో ఎక్కువమంది తనను ఈ పని కోసం సంప్రదిస్తుంటారని ఫ్రెడ్డీ తెలిపారు. తక్కువ నైపుణ్యం అవసరమయ్యే ఈ పనితో బాగానే సంపాదిస్తున్నప్పటికీ, పుల్టైం జాబ్ వేరే చూసుకుంటానని తెలిపారు. నిలబడటంలో తన నైపుణ్యాల గురించి ఇతను టాస్క్ ర్యాబిట్ (ఆన్లైన్ వేదిక)లో ప్రకటన కూడా ఇచ్చాడు.













