డొనాల్డ్ ట్రంప్ పై.. న్యూయార్క్ కోర్టులో దావా

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍పై ఒక చైనీస్-అమెరికన్ పౌర హక్కుల గ్రూప్, న్యూయార్క్ లోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. కొవిడ్-19 వైరస్‍ను ఆయన చైనా వైరస్ అన్నారంటూ ఈ గ్రూప్ కోర్టులో కేసు వేసింది. కరోనా వైరస్ మూలం గురించి ఇంకా నిర్ణయించకపోయినా ట్రంప్ మాత్రం నిరాధారంగా చైనా వైరస్ అన్నారని చైనీస్ అమెరికన్స్ సివిల్ రైట్‍స కొలిషన్ (సీఏసీఆర్‍సీ) తన ఫిర్యాదులో తెలిపింది. ఆయన వ్యక్తిగత, రాజకీయ ప్రయోజనాల కోసం ఈ పదాన్ని వినియోగించారని తెలిపింది. ట్రంప్ ప్రవర్తన తీవ్రంగా ఉన్నట్టు అందులో పేర్కొంది. అంతేకాకుండా ఆసియన్ అమెరికన్లపై జరిగిన దాడులను ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో అమెరికాలో నివసిస్తున్న ప్రతి ఆసియన్ అమెరికన్‍కు ఒక డాలర్ చొప్పున చెల్లించాలని సీఏసీఆర్‍సీ డిమాండ్ చేసింది. ఈ మొత్తం 22.9 మిలియన్ డాలర్లు కానుంది.