సిడ్నీ స్టేడియంలో టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం
టీఆర్ఎస్ మద్దతుదారులు ప్రచారంలో వినూత్న పంథాను ఎంచుకున్నారు. ఆస్ట్రేలియా సిడ్నీ స్టేడియంలోని క్రికెట్ మ్యాచ్ వేదికగా కేసీఆర్ జిందాబాద్.. ఓట్ ఫర్ టీఆర్ఎస్ ఇన్ జీహెచ్ఎంసీ అనే నినాదాలతో హోరెత్తించారు. ఆస్ట్రేలియా -ఇండియా వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సిడ్నీలోని స్టేడియంలో టీఆర్ఎస్ ఎన్నారై ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేశ్ రాపోలు, రవిశంకర్ దూపాటి ఆధ్వర్యంలో కేసీఆర్ జిందాబాద్, వోట్ ఫర్ టీఆర్ఎస్ అనే ప్లకార్డులతో నినాదాలు చేశారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు తమ అమూల్యమైన ఓటును కారు గుర్తుకు వేయాలని ఆస్ట్రేలియా టీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి కోరారు. అభివృద్ధి చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించాలని రాజేశ్ రాపోలు పిలుపునిచ్చారు.













