భద్రతా మండలి వేదికపై.. భారత్ ఆందోళన
సుమీలో భారతీయ విద్యార్థుల కోసం మానవతా కారిడార్ కార్యరూపం దాల్చలేదని భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. భద్రతా మండలిలో భారత రాయబారి తిరుమూర్తి మాట్లాడుతూ ఈ కారిడార్ ఏర్పాటు కోసం భారత్, ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్లను కోరిందని, అయినా ఇంకా అమల్లోకి రాకపోవడంపై ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. సుమీ స్టేట్ యూనివర్శిటీలో దాదాపు 700 మంది భారతీయులున్నారు. వీరిలో చాలామంది వైద్య విద్యార్థులే. తక్షణమే కాల్పుల విరమణ పాటించా, దౌత్య మార్గాలు, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం వుందని భారత ప్రధాని ఇరు పక్షాలకు తెలియజేశారని చెప్పారు. ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయులతో సహా అమాయకులైన పౌరులందరూ సురక్షితంగా వారి వారి స్వస్థలాలకు చేరాలన్నది తమ డిమాండ్ అని అన్నారు.













