ఈ కూటమి నుంచి రష్యాను బహిష్కరించాలి… జెలెన్స్కీ విజ్ఞప్తి
ఖేర్సన్ నగరాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం రెండో ప్రపంచయుద్ధంలో డీ-డే రోజు మిత్రదేశాలు ఫ్రాన్స్‌లో అడుగు పెట్టడంలాంటిదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభివర్ణించారు. ఈ రెండు సంఘటనలు అంతిమ గెలుపు మార్గాల్లో గొప్ప మలుపులని పేర్కొన్నారు. జీ-20 సమావేశాన్ని జీ-19 సదస్సుగా అభివర్ణించిన ఆయన ఈ కూటమి నుంచి రష్యాను బహిష్కరించాలని కోరారు. జీ-20 వీడియోలింక్ ద్వారా ప్రసంగించారు. ఉక్రెయిన్ దురాక్రమణకు పాల్పడిన నేరంపై రష్యా సైన్యం, రాజకీయనేతలను విచారించేందుకు ప్రత్యేక ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే యుద్ధంలో సంభవించిన మరణాలు, విధ్వంసానికి నష్టపరిహారం కోసం అంతర్జాతీయ వ్యవస్తను రూపొందించాలన్నారు.













