అమెరికాలో కాల్పుల కలకలం
అగ్రరాజ్యం అమెరికాలో టెన్నిసెసి సూపర్ మార్కెట్లో కాల్పుల ఘటన జరిగింది. ఆ కాల్పుల్లో ఒకరు మృతి చెందగా, మరో 12 మంది గాయపడ్డారు. కాల్పులకు తెగించిన సాయుధుడిని షూట్ చేశారు. మెమ్పిస్కు శివారులో ఉన్న కొల్లిర్విల్లేలోని క్రోగర్ గ్రాసరీ స్టోర్‌లో ఈ ఘాతకం జరిగింది. సాయుధుడు జరిపిన కాల్పుల్లో కొందరికీ తీవ్రమైన గాయాలు అయినట్లు పోలీసు చీఫ్ డేల్ లెన్ తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. కాల్పుల ఘటన జరగ్గానే స్కాట్ దళాలు ఆ సూపర్ మార్కెట్‌ను చుట్టముట్టేశాయి. మాల్లో ఉన్న జనం భయంతో ఫ్రీజర్లలో దాకున్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎఫ్బీఐతో పాటు ఇతర దర్యాప్తు ఏజెన్సీలు ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నాయి.













