అమెరికాలో మరోసారి కాల్పులు
అమెరికాలో మరోసారి తుపాకీ విష సంస్కృతి జడలు విప్పింది. ఇల్లినాయిస్ రాష్ట్రంలో జోలియెట్ పట్టణంలో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రెండు వేర్వేరు ఇళ్లలో ముష్కరుడు కాల్పులకు తెగబడ్డారు. నిందితుణ్ని రోమియో నాన్స్గా గుర్తించారు. మరణించిన వారితో అతడికి ముందు నుంచే పరిచయం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం నుంచే ఈ దుశ్చర్యకు పాల్పడుతున్పటికీ ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మరణాయుధాలతో రోమియో నాన్స్ ఎరుపు రంగు టయోటా కారులో తప్పించుకు తిరిగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అతడి గురించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.













