రెండు దేశాల సరిహద్దుల్లో కాల్పులు… 15 మంది

అమెరికా, మెక్సికో సరిహద్దుల వద్ద ముష్కరులు జరిపిన కాల్పుల్లో 15 మంది మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సరిహద్దు వద్ద ఉన్న వంతెన సమీపంలో పోలీసులపై ముష్కరులు దాడిలో ఓ వ్యక్తి మరణించాడు. కానీ మిగిలిన వారిపై ముష్కరులు యాధృచ్ఛికంగానే కాల్పులు జరిపారా? లేదా లక్ష్యంగా చేసుకుని కాల్చారా. అన్నది తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఘటనానంతరం భద్రతదళాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. రెండు దేశాల సరిహద్దుల్లోని మెక్సికో నగరం రేనోసాలో ఈ ఘటన జరిగింది.