శ్రీశ్రీ రవిశంకర్‌కు సురినామ్ అత్యున్నత పురస్కారం

ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ వ్యవస్థాపకులు శ్రీశ్రీ రవిశంకర్‌కు గొప్ప గౌరవం దక్కింది. దక్షిణ అమెరికాలో తీరప్రాంత దేశమైన సురినామ్.. రవిశంకర్‌ను తమ దేశ అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించింది. ఆనరరీ ఆర్డర్ ఆఫ్ ది ఎల్లో స్టార్ అని పిలిచే అవార్డును సురిమాన్ అధ్యక్షుడు చాన్ సంతోఖి రవిశంకర్‌కు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో సురినామ్ భారత రాయబారి శంకర్ బాలచంద్రన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిశంకర్ స్పందిస్తూ సురినామ్ అత్యున్నత అవార్డు పొందడం చాలా గౌరవంగా భావిస్తున్నా. ఈ దేశంలో ప్రశంసనీయ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులకు, వాలంటీర్లకు ఈ పురస్కారం అంకితం చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని ఇప్పటి వరకు దేశాధినేతలకు మాత్రమే ప్రదానం చేస్తుండగా తొలిసారిగా ఓ ఆద్మాత్మికవేత్తకు ఇచ్చారు. ఆసియా ఖండం నుంచి ఈ అవార్డు అందుకున్న మొదటి వ్యక్తి రవిశంకర్‌నే కావడం గమనార్హం.











































































