అమెరికా మూన్ మిషన్ ఫెయిల్?
మూన్ మిషన్ పేరుతో 50 ఏళ్ల తర్వాత తొలిసారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను పంపేందుకు అమెరికా చేపట్టిన ప్రయోగం సందిగ్ధంలో పడింది. లాంఛింగ్ అయిన గంటల వ్యవధిలోనే స్పేస్ క్రాఫ్ట్‌లో ఇంధన లీకేజీ లోపం వెలుగుచూసింది. ల్యాండర్ ప్రొపల్షన్ సిస్టమ్‌లో వైఫల్యాన్ని గుర్తించినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో చంద్రుడిపై ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్‌పై సందిగ్ధం నెలకొంది. పిట్స్బర్గ్కు చెందిన ఆస్ట్రోబోటిక్ టెక్నాలజీస్ అనే ప్రైవేటు సంస్థ ఫ్లోరిడాలోని కేప్ కెనవల్స్పేస్ స్టేష్ నుంచి మూన్ మిషన్ పేరుతో చంద్రుడిపైకి ఈ ల్యాండర్‌ను పంపింది. ల్యాండర్‌ను సూర్యుడి దిశగా తిరిగేలా చేశారు. ల్యాండర్‌కు కావాల్సిన శక్తి సోలార్ ప్యానెల్ ద్వారా స్వీకరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఫిబ్రవరి 23న జాబిల్లిపై ల్యాండర్ దిగాల్సి ఉంది. అయితే చాలా వరకు ఇంధనం వృధా అయిన నేపథ్యంలో ల్యాండింగ్‌పై ఆశలు సన్నగిల్లాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మిషన్ లక్ష్యాలను సవరించుకుంటున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిస్థితుల్లో ఏం చేయగలమనే అంశంపై సమాలోచనలు చేస్తున్నారు.













