ఇది సమాజానికి ప్రమాదం … సౌదీ అరేబియా
అంతర్జాతీయ సున్నీ ఇస్లామిక్ మిషనరీ ఉద్యమం అయిన తబ్లిగీ జమాత్ సంస్థపై సౌదీ అరేబియా నిషేధం విధించిది. ఈ సంస్థ సమాజానికి ప్రమాదకరమని పేర్కొంది. ఈ గ్రూపు ఉగ్రవాదానికి ముఖద్వారంగా ఉందని ఆరోపించింది. ప్రార్థనల సందర్భంగా ఈ సంస్థ సభ్యులతో సంబంధాలు, ఏర్పరచుకోవడంపై అందరినీ హెచ్చరించాలని మసీదులకు ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు ఆ దేశ ఇస్లామిక్ వ్యవహారాల మంత్రి డాక్టర్ అబ్దుల్ లతీఫ్ అల్షేక్ ప్రకటన చేశారు. వచ్చే శుక్రవారం ప్రార్థనల్లో కొంతసమయాన్ని కేటాయించి తబ్లిగి, దావా గ్రూప్ గురించి ప్రజలను హెచ్చరించాలని మసీదులకు, బోధకులకు అబ్దుల్ లతీఫ్ ఆదేశించారని డిసెంబర్ 6వ తేదీ నాటి ఇస్లామిక్ మంత్రిత్వ శాఖ పేర్కొంది.













