ఆ దేశంలో ఎవరైనా కానీ… ఇద్దరు కలసి పెళ్లి చేసుకోవచ్చు
లింగంతో సంబంధం లేకుండా స్విట్జర్లాండ్‌లో ఎవరైనా ఇద్దరు కలసి పెళ్లి చేసుకోవచ్చు. ఇది పూర్తిగా చట్టబద్ధమే. వివాహం అంటే చట్టబద్ధమైన నిర్వచనాన్ని అక్కడ మర్చారు. వధువు, వరుడు కలవడం అని కాకుండా ఇద్దరు వ్యక్తుల సంగమంగా అక్కడ నిర్వచనం మార్చారు. ఇందుకోసం స్విట్జర్లాండ్ ప్రభుత్వం గత సంవత్సరం ప్రజాభిప్రాయం సేకరణ చేపట్టిది. ఎవరైనా కానీ ఇద్దరు వివాహం చేసుకునేందుకు అనుకూలంగా అక్కడ 64 శాతం మంది ఓటు వేశారు. యూరోప్‌లో ఆలస్యంగా ఈ విధమైన నిర్ణయం తీసుకున్న దేశం స్విట్జర్లాండ్ అని గుర్తు ఉంచుకోవాలి. ఇప్పటికే యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఐస్లాండ్, బెల్జియం, ఐర్లాండ్, మాల్టా, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్పెయిన్, నార్వే, స్వీడన్ తదితర దేశాలు ఏక లింగ వివాహాలను ఆమోదించాయి. తాజా నిర్ణయంతో స్విజ్జర్లాండ్‌లో ఏక లింగ దంపతులకు సైతం మిగిలిన వారితో సమానమైన హక్కులు లభిస్తాయి.













