మాకు విజయం తప్ప వేరే మార్గం లేదు
ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు జరుపుకొంటున్న వేళ ఉక్రెయిన్ రాజధాని కీవ్ సైరన్లు, బాంబుల మోతతో దద్దరిల్లింది. రష్యా క్షిపణులు, డ్రోన్ల దాడులకు భయాందోళనలతో ప్రజలు సురక్షిత ఆవాసాలకు పరుగుతు తీశారు. ఆదివారం అర్థరాత్రి నుంచి వరుస డ్రోన్లు కీవ్ గగనతలాన్ని కమ్మేశాయి. వీటిలో 45 డ్రోన్లను నేలకూల్చినట్లు ఉక్రెయిన్ వైమానికదళం పేర్కొంది. ఈ దాడులకు తాము భయపడమని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. చాలామంది మేం లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదని అన్నారు. కానీ మాకు విజయం తప్ప వేరే మార్గం లేదు అని ఆయన తెలిపారు. రష్యాతో పోరులో ఉక్రెయిన్ విజయం సాధించేవరకు తాము అండగా నిలుస్తామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ అన్నారు. ఐరోపా కూడా దన్నుగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.













