భారత్ వైఖరిపై ఎవరికి అసంతృప్తి లేదు: ఆస్ట్రేలియా
ఉక్రెయిన్పై రష్యా దాడి అంశంలో భారత వైఖరిని క్వాడ్ కూటమిలోని సభ్య దేశాలు అర్థం చేసుకున్నాయని ఆస్ట్రేలియా స్పష్టం చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన పరిచయాలను ఉపయోగించుకొని యుద్ధం ముగింపునకు ప్రయత్నిస్తున్నారని, అందువల్ల ఈ అంశంలో ఎవరికీ అసంతృప్తి లేదని భారత్లో ఆస్ట్రేలియా హై కమిషనర్ బ్యారీ ఓ ఫారెల్ పేర్కొన్నారు. ఘర్షణలను ఖండించడానికి బదులు, వాటి పరిష్కారానికి అనువైన పరిస్థితులను సృష్టించడంపై దృష్టి పెట్టాలన్న నెహ్రూ విధానానికి అనుగుణంగా భారత్ నడుచుకుంటున్నట్లు దౌత్య వర్గాలు తెలిపాయి.













