జి-20 సమావేశాలకు రండి.. పుతిన్, జెలెన్స్కీలకు
నవంబరులో జరగనున్న జి-20 సమావేశాలకు రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీలను ఆహ్వానించినట్లు ఇండొనేషియా అధ్యక్షుడు జొకో విడోడో తెలిపారు. ఆ రెండు దేశాల అధినేతలు హాజరైన పక్షంలో వారి మద్య ముఖాముఖి జరిగే అవకాశం లేదని ఆయన అన్నారు. జి`20 సమావేశానికి రష్యా అధ్యక్షుడిని పిలవొద్దంటూ అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు ఇండొనేషియాపై ఎంతగా ఒత్తిడి చేసినప్పటికీ వాటిని జొకో విడోడో లెక్కచేయకుండా స్వతంత్రంగా వ్యవహరించారు. పుతిన్ హాజరయ్యేది లేనిది ఇప్పుడే చెప్పలేమని అధ్యక్ష భవన ప్రతినిధి తెలిపారు.













