మధ్యప్రాచ్యంలో అమెరికా ఘోరంగా విఫలమైంది : పుతిన్ విమర్శ
మధ్య ప్రాచ్యంలో అమెరికా విధానం ఘోరంగా విఫలమైందని రష్యా అధ్యక్షుడు పుతిన్ విమర్శించారు. అంతర్జాతీయ ఒప్పందాలను తుంగలో తొక్కి ఇజ్రాయెల్‌కు అమెరికా బాహాటంగా వత్తాసు పలకడం పలు విమర్శలకు దారి తీసింది. మాస్కోలో రష్యా ఇంధన వారోత్సావాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో పుతిన్ మాట్లాడారు. ఈ సమంస్యను పరిష్కరించడానికి గతంలో రష్యా ఇతర దేశాలు ప్రయత్నించిన అంతర్జాతీయ సాధనాలన్నింటినీ అమెరికా పక్కకు నెట్టేసిందని, పరిష్కార క్రమాన్ని తానే గుత్తాధిపత్యానికి తీసుకున్నట్లు వ్యవహరించిందని పుతిన్ అన్నారు. సెటిల్మెంట్లపై ఇజ్రాయిల్ అనుసరించిన విధానం బెడిసికొట్టిందని అన్నారు. స్వతంత్య్ర, సార్వభైమాధికార పాలస్తీనా దేశం ఏర్పడేందుకు ఐక్యరాజ్య సమతి భద్రతా మండలి గతంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాల్సిన అవసరం వుందని ఇరు పక్షాలకు రష్యా స్పష్టం చేసిందన్నారు. ఈ సమస్య చాలా సున్నితమైనది, సంక్లిష్టమైనది అయినందున, రెచ్చగొట్టే చర్యలకు, వ్యాఖ్యలకు ప్రతి ఒక్కరూ దూరంగా వుందన్నారు.













